BPT: బల్లికురవ మండల కేంద్రంలోని పశు వైద్యశాల పరిధిలోని రైతులకు ప్రభుత్వం అందిస్తున్న 50 శాతం రాయితీ పశుగ్రాసం పంపిణీ కార్యక్రమం మంగళవారం ప్రారంభమైంది. డాక్టర్ పీ.మహేశ్వర రావు ఆధ్వర్యంలో బల్లికురవ, చెన్నుపల్లి, కొప్పెరపాలెం, ముక్తేశ్వరం గ్రామాలకు చెందిన పశుపోషకులకు ఈ దాణాను పంపిణీ చేశారు. పశువుల పోషణలో మేలైన దాణా పాత్ర కీలకమని ఆయన అన్నారు.