కడప జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం జరిగిన ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’కు 61 ఫిర్యాదులు అందాయి. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ (అడ్మిన్) కె. ప్రకాష్ బాబు ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని, చట్టపరిధిలో సత్వర న్యాయం జరిగేలా చూడాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు.