కర్నూలు అశోక్ నగర్ నీటి శుద్ధి కేంద్రంలో వాల్వ్ మరమ్మతుల కారణంగా బుధవారం పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరా నిలిచిపోతుందని కేఎంసీ కమిషనర్ ఓబులేసు ఇవాళ ఒక ప్రకటనలో తెలిపారు. ధర్మపేట, గాంధీ పార్క్, ఖాదక్పురా, అశోక్ నగర్, ఓల్డ్ బస్టాండ్, వన్‌టౌన్ ప్రాంతాలు ప్రభావితమవుతాయి. గురువారం నుంచి యథావిధిగా నీటి సరఫరా పునరుద్ధరించబడుతుందిన్ని పేర్కొన్నారు.