కృష్ణా: పెడనలోని విద్యాసంస్థల వద్ద ఆకతాయిల ఆగడాలు పెరగడంతో జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. విద్యార్థినుల భద్రత కోసం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో డ్రోన్ నిఘాను అమలు చేస్తున్నారు. బుధవారం బట్టా జ్ఞాన కోటయ్య జిల్లా పరిషత్ పాఠశాల వద్ద డ్రోన్ నిఘా నిర్వహించి, శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ఠ చర్యలు చేపట్టారు.