GNTR: కొల్లిపర మండలం తూములూరు అడ్డరోడ్డు సెంటర్లో శుక్రవారం రాత్రి పేకాడుతున్న ఏడుగురు జూదరులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్సై ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. పక్కా సమాచారంతో దాడులు నిర్వహించి నిందితుల వద్ద నుంచి రూ. 4,300 నగదును స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.