GNTR: రాష్ట్ర మహిళా కమిషన్ ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీన ‘జన్ సున్ వాయ్’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా శుక్రవారం తెలిపారు. మంగళవారం ఉదయం 10 గంటల నుంచి జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఈ విచారణ జరుగుతుంది. ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించడంతో పాటు, పెండింగ్లో ఉన్న అంశాలను ఈ సందర్భంగా పరిష్కరించనున్నట్లు తెలిపారు.