KDP: విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులను అడ్మిషన్ల కోసం వేధిస్తున్నాయని AIBSU నేత జగన్ రాథోడ్ ఆరోపించారు. ఇవాళ కలెక్టరేట్లో DROకు వినతిపత్రం సమర్పించారు. తీవ్రమైన ఎండలను సైతం లెక్కచేయకుండా, వారి అనారోగ్యాన్ని పట్టించుకోకుండా లక్ష్యాలను నిర్దేశిస్తున్నారని, లక్ష్యాలు పూర్తి చేయకపోతే జీతాలు ఇవ్వబోమని బెదిరిస్తున్నారని తెలిపారు.