సత్యసాయి: కదిరి మండలం బాలికల హై స్కూల్లో ఏపీ సమగ్ర శిక్ష నిధులతో సుమారు రూ.10 లక్షల వ్యయంతో నిర్మించిన MRC రీనోవేషన్ భవనాన్ని ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ మంగళవారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ భవనం ద్వారా విద్యా కార్యకలాపాలు మరింత మెరుగుపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.