కడప: జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మున్సిపల్ హైస్కూల్లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సీ.ఐ జీ. ప్రసాద్ రావు విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని మంచి పౌరులుగా ఎదగాలని సూచించారు. పోక్సో చట్టం, పిల్లల భద్రత, సైబర్ నేరాలు, రహదారి భద్రతపై అవగాహన కల్పించారు.