W.G: పెంటపాడు డీఆర్ గోయంకా ప్రభుత్వ డిగ్రీ కళాశాలను మంగళవారం రీజనల్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ పీవీ. కృష్ణాజీ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కళాశాలలో విద్యార్ధులకు సమస్యలు ఏమైనా ఉంటే తెలియజేయాలని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. బోధన, కళాశాల అభివృద్ధిపై ఆర్జేడీ అధ్యాపకులు, విద్యార్థులతో చర్చించారు.