NZB: ధర్పల్లి మండలం రేకులపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణానికి NRGS ఫండ్స్ రెండు లక్షల రూపాయలు మంజూరు అవడంతో సోమవారం గ్రామ సర్పంచ్ జీ. రాజేందర్, స్కూల్ హెడ్మాస్టర్ లింగారెడ్డి ఆధ్వర్యంలో పాఠశాల ఆవరణలో మరుగుదొడ్ల కోసం భూమి పూజ నిర్వహించారు. సర్పంచ్ మాట్లాడుతూ.. తొందరలోనే పూర్తి చేసి విద్యార్థులకు సౌకర్యాలు కల్పిస్తామన్నారు.