ప్రకాశం: కావలి రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన సోమవారం చోటుచేసుకుంది. పూరి ఎక్స్ప్రెస్ రైలు వస్తున్న క్రమంలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడగా స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. సదరు వ్యక్తి చెంత చెన్నై సెంట్రల్ నుంచి ఒంగోలుకు వెళ్లే టికెట్ ఉండడంతో మృతుడు ఒంగోలుకు చెందిన వ్యక్తిగా పోలీసులు అనుమానిస్తున్నారు.