TPT: శ్రీకాళహస్తిలో మున్సిపల్ అధికారి దౌర్జన్యం చేస్తున్నారని కోట వినుత ఆరోపించారు. జనసేన కార్యకర్త కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ ఇళ్లను కూల్చేస్తామని బెదిరిస్తున్నారని ట్వీట్ చేశారు. 80 ఏళ్ల గుణభూషణమ్మ తమ సొంత స్థలంలో మరమ్మతులు చేపడుతుండగా కమిషనర్ అడ్డుకుని హెచ్చరించాడన్నారు. అనుమతులు పొందేందుకు ఎమ్మెల్యేను కలవాలంటూ ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు.