NTR: కంచికచర్లలో ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్‌పై కేసు నమోదైంది. ఆదివారం ఓసీ క్లబ్లో ‘బాబు షూరిటీ – మోసం గ్యారంటీ’ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, టీడీపీ నాయకులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని మండల టీడీపీ అధ్యక్షుడు సత్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మంగళవారం పోలీసులు ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.