ప్రకాశం: జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు దోర్నాలలో మంగళవారం వెలిగొండ ప్రాజెక్టుపై 3 గంటల సమీక్ష నిర్వహించారు. టన్నెల్ లైనింగ్ పనులు నెమ్మదించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులకు తెలిపారు. ఇంధనం, కార్మికులు, యంత్రాల సమస్యలను అధిగమించి పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రాజెక్టు పనులలో అలసత్వం వహించవద్దన్నారు.