ATP: అరవింద నగర్లోని క్యాంపు కార్యాలయంలో శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ప్రజలను కలిశారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారి నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. విద్య, వైద్యం, మౌలిక వసతులపై వచ్చిన అర్జీల పరిష్కారానికి కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు.