TPT: టీటీడీ పరకామణి తొలి మహిళా మాజీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బొమ్మారెడ్డి శారద (68) మృతిచెందారు. 2011 నవంబరులో టీటీడీ.. పరకామణి డిప్యూటీ ఈవోగా ఆమెను నియమించింది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం హైదరాబాద్లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆమె మృతి పట్ల పలువురు టీటీడీ అధికారులు సంతాపం తెలిపారు.