W.G: కళలకు పుట్టినిల్లు పాలకొల్లు అని సినీ హీరో శ్రీకాంత్ అన్నారు. శనివారం రాత్రి పాలకొల్లులో ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు నేషనల్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ శిక్షణ తరగతుల ప్రారంభోత్సవంలో అయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నటుడికి శిక్షణ ఎంతో అవసరమన్నారు. పాలకొల్లులో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నెలకొల్పి యువతను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు.