TPT: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనం (SSD టోకెన్లు లేకుండా) కోసం సుమారు 8 గంటల సమయం పడుతోంది. ప్రస్తుతం 20 వెయిటింగ్ కంపార్ట్మెంట్లలో భక్తులు వేచియున్నారు. నిన్న మొత్తం 77,743 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వీరిలో 30,276 మంది తలనీలాలు సమర్పించగా, హుండీ ఆదాయం రూ. 3.59 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.