KRNL: వేసవి తాపంతో ప్రజలు అల్లాడుతున్నారు. గుక్కెడు తాగునీటి కోసం మంగళవారం పత్తికొండ మండలం అటికెలగుండు గ్రామంలో ప్రజలు తల్లడిల్లుతున్నారు. గ్రామంలో ఒక్క బిందె తాగునీటి కోసం మినీ ట్యాంకుల వద్ద గంటల తరబడి నిలుచున్నా దొరకని దుస్థితి నెలకొందని గ్రామస్తులు మండిపడుతున్నారు. స్వాతంత్య్రం వచ్చి 78 ఏళ్లు గడుస్తున్నా పాలకులు కనీసం నీటి సమస్యలను తీర్చలేదన్నారు.