W.G: చంద్రగ్రహణం సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన పాలకొల్లులోని క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని ఆదివారం మధ్యాహ్నం మూసివేశారు. సోమవారం ఉదయం 7 గంటలకు సంప్రోక్షణ అనంతరం ఆలయం తిరిగి తెరుచుకుంటుందని ఈవో ముచ్చర్ల శ్రీనివాస్ తెలిపారు. సెలవు రోజు కావడంతో వచ్చిన యాత్రికులు ఆలయం మూసివేయడంతో ఇబ్బందులు పడ్డారు. యాత్రికులు సహకరించాలని ఈవో కోరారు.