ELR: ప్రస్తుత కాలంలో క్యాన్సర్ మహమ్మారి మరింత విజృంభిస్తోందని, దాన్ని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్దితో కృషి చేస్తున్నాయని ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. ఏలూరు పవర్ పేటలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వ్యాధిని అరికట్టే HPV వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.