NTR: విజయవాడ–నిడదవోలు మధ్య రైల్వే ట్రాక్ విస్తరణ పనులకు త్వరలో శ్రీకారం చుట్టనున్నారు. ప్రస్తుతం డబ్లింగ్లో ఉన్న ఈ మార్గంలో 3, 4 లైన్లు నిర్మించేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అవసరమైన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. డీపీఆర్ సిద్ధం కోసం ఫైనల్ లోకేషన్ సర్వేకు అనుమతి లభించిందని లోక్సభ సభ్యురాలు దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు.