NTR: తిరువూరు MLA కార్యాలయంలో గంపలగూడెం మండల అధికారులతో MLA కొలికపూడి శ్రీనివాసరావు బుధవారం రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ, పంచాయతీరాజ్, వ్యవసాయ, గ్రామీణ నీటి సరఫరా, విద్య, గృహ నిర్మాణ, మహిళా శిశు సంక్షేమ, పోలీస్, విద్యుత్, మత్స్య శాఖ అధికారులు పాల్గొని పలు విషయాలపై చర్చించారు. అనంతరం MLA వారికి పలు సూచనలు చేశారు.