W.G: మొగల్తూరు ఆనంద్ రొయ్యల ఫ్యాక్టరీలో శనివారం కార్మికులకు అగ్నిప్రమాదాల నివారణ, భద్రతా చర్యలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఫైర్ ఆఫీసర్ భాస్కర్ రామమ్ కార్మికులకు ఫైర్ సేఫ్టీపై కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిశ్రమల్లో అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలిపారు.