సత్యసాయి: కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆధ్వర్యంలో ‘రెవెన్యూ క్లినిక్స్’ కార్యక్రమం ద్వారా భూ సమస్యలను వేగంగా పరిష్కరిస్తున్నారు. తహసీల్దార్లు, ఆర్డీవోలు ఒకేచోట రికార్డులను పరిశీలిస్తూ అడంగల్ మార్పులు, మ్యుటేషన్లు, వారసత్వ నమోదు పనులు పూర్తి చేస్తున్నారు. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న వివాదాలను పరిష్కరిస్తూ రైతులకు భరోసా కల్పిస్తున్నారు.