KRNL: అమావాస్య సందర్భంగా మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి శాలువా కప్పి ప్రసాదం అందజేశారు. రాష్ట్ర ప్రజలు, రైతులు సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.