PLD: వినుకొండ సమీపంలోని పసుపులేరు బ్రిడ్జి వద్ద రైలు నుంచి ప్రమాదవశాత్తూ జారిపడి గురువారం ఓ వృద్ధుడు మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన రైల్వే పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడి వద్ద ఉన్న ఆధార్ కార్డు ఆధారంగా ఆయనను పల్నాడు జిల్లా చిన్న కొదమగుండ్ల గ్రామానికి చెందిన భద్రారెడ్డిగా గుర్తించారు.