KDP: రాష్ట్ర శాశ్వత రాజధానిగా అమరావతిని కొనసాగించడాన్ని స్వాగతిస్తున్నామని TDP జిల్లా అధ్యక్షుడు భూపేశ్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం కడప TDP కార్యాలయంలో ఆయన మాట్లాడారు. అమరావతి కేవలం ఒక నగరం కాదు,అది 5కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవం, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి అమరావతే దిక్సూచి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో TDP పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.