ప్రకాశం: కొండపి గ్రంథాలయంలో మౌలిక వసతులు మెరుగుపరిచేందుకు కృషి చేస్తానని జిల్లా గ్రంధాలయ పరిషత్ ఛైర్మన్ తెలిపారు. గురువారం ఆమె కొండపి గ్రంథాలయాన్ని తనిఖీ చేశారు. పుస్తకాలను పరిశీలించారు. గ్రంథాలయంలో మరుగుదొడ్లు లేవని పాటకలు ఛైర్మన్ దృష్టికి తీసుకువచ్చారు. వాటి నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.