సత్యసాయి: ధర్మవరం రైల్వే జంక్షన్లో గత కొన్నిరోజులుగా పనులు జరుగుతుండటంతో మచిలీపట్నం (17215/16) రైలు అనంతపురం నుంచి నడిచేది. పనులు పూర్తి కావడంతో ఈ రైలు ధర్మవరం నుంచి యథావిధిగా బయల్దేరుతుందని రైల్వే అధికారులు పేర్కొన్నారు. రైలు ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. ఈ ట్రైన్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.