ATP: మచిలీపట్నం-ధర్మవరం ఎక్స్ప్రెస్ (17215/16) రైలు మే 1 వరకు అనంతపురం వరకే నడవనుంది. అనంతపురం-ధర్మవరం రైల్వేస్టేషన్ల మధ్య రద్దు చేశారు. ధర్మవరం రైల్వేస్టేషన్లో అభివృద్ధి పనులు సాగుతుండటంతో ఈ రైలును అనంతపురంలోనే ఆపేస్తున్నారు. మచిలీపట్నం నుంచి అనంతపురానికి ఉదయం 8.30 గంటలకు చేరుకొని అనంతపురం నుంచి సా. 5.55 గంటలకు తిరిగి మచిలీపట్నానికి బయలుదేరుతుంది.