NLR: సైదాపురంలోని మండల పరిషత్ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. అనంతరం ప్రజా దర్బార్ కార్యక్రమానికి హాజరైన MLA కురుగొండ్ల రామకృష్ణకు పొదుపు మహిళలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి బుధవారం ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అర్జీలపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు.