PLD: ఎడ్లపాడు మండలం చంగిస్ ఖాన్ పేట-సంక్రాంతిపాడు మధ్య రోడ్డు ప్రమాదానికి గురైన ఆంజనేయులును గమనించి ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు మానవత్వాన్ని చాటుకున్నారు. వెంటనే తన సొంత వాహనంలోనే ఆస్పత్రికి తరలించారు. అనంతరం వైద్యులతో మాట్లాడి మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. బాధితుడి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి భరోసా ఇచ్చారు.