E.G: ప్రస్తుతం ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో మూగజీవాలకు నీటి సదుపాయం కల్పించేందుకు జైన్ సేవా సమితి శ్రీకారం చుట్టింది. శుక్రవారం రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చేతుల మీదుగా ప్రజలకు నీటి కుండీలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మూగజీవాలకు నీటిని అందించేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.