E.G: కొవ్వూరు RTC బస్‌స్టాండ్ వద్ద కొవ్వూరు నుంచి తాళ్లపూడి, పోలవరం వెళ్ళే నూతన బస్ సర్వీస్‌ను కొవ్వూరు MLA ముప్పిడి వెంకటేశ్వరరావు ఇవాళ ప్రారంభించారు. ఈ బస్సు సర్వీస్ కొవ్వూరు డిపో నుంచి సాయంత్రం 5.45 నిమిషాలకు ప్రారంభమవుతుందని తెలిపారు. కావున ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.