NDL: నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన టంగుటూరి సీనయ్యను మంగళవారం జనసేన నాయకులు ఘనంగా సన్మానించారు. జనసేన నేత భాస్కర్ ఆధ్వర్యంలో సీనయ్యను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ.. సీనయ్య సేవా కార్యక్రమాలతో ప్రజల్లో గుర్తింపు పొందారని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు.