ASR: రెవెన్యూశాఖలో పనితీరు మెరుగుపరచడమే లక్ష్యంగా ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసిందని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. ప్రజల నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్ ఆధారంగా సిబ్బంది పనితీరును అంచనా వేయనున్నట్లు తెలిపారు. మంగళవారం రంపచోడవరం నుంచి అధికారులతో వీసీ నిర్వహించారు. ఐవీఆర్ఎస్ కాల్స్‌లో నెగటివ్ ఫీడ్ బ్యాక్ వస్తే సంబంధిత సిబ్బందిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.