NTR: తిరువూరులో కృష్ణా జిల్లా కోఆపరేటివ్ బ్యాంకు ఉద్యోగుల నిరవధిక సమ్మె చేపట్టారు. ఈ సమ్మెకు సీపీఎం జిల్లా కార్యదర్శి కృష్ణయ్య శుక్రవారం హాజరయ్యి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెండింగ్లో ఉన్న పీఆర్సీని తక్షణమే చెల్లించాలన్నారు. 2019 నుంచి ఉద్యోగం చేస్తున్న కార్మికులను రెగ్యులర్ చేయాలని, ప్రభుత్వ హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.