AKP: జిల్లాలో శుక్రవారం జరిగిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షకు 124 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఐఈవో వినోద్ బాబు తెలిపారు. మొత్తం 8,888 మంది హాజరు కావలసి ఉండగా 8,764 మంది హాజరైనట్లు పేర్కొన్నారు. పరీక్షలు ప్రశాంతంగా పకడ్బందీగా జరుగుతున్నట్లు తెలిపారు. ఎటువంటి మాస్ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు.