AKP: అనకాపల్లి-అచ్యుతాపురం రోడ్డు విస్తరణలో భూములు కోల్పోతున్న రైతులకు హైకోర్టు తీర్పు ఊరటనిచ్చిందని వైసీపీ జిల్లా అధ్యక్షులు బొడ్డేడ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు మునగపాక పార్టీ కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. TDR బాండ్లకు బదులు 2013 భూసేకరణ చట్టం ప్రకారం నగదు పరిహారం ఇవ్వాలని కోర్టు ఆదేశించిందన్నారు.