PLD: రెంటచింతల మండలంలోని గోలి గ్రామం వద్ద గోలి వాగుపై ఉన్న చప్టా బ్రిడ్జిని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పరిశీలించారు. వాగులో వృథాగా పోతున్న మిగులు జలాలను నిల్వ చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఇరిగేషన్ శాఖ అధికారులతో మాట్లాడిన ఎమ్మెల్యే, గోలి వాగుపై నూతన చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.