TPT: తిరుపతి నగరంలోని శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఆధునీకరణ పనులు జరుగుతున్నాయి. ఈ పనులను శుక్రవారం ఏపీ స్పోర్ట్స్ చైర్మన్ రవి నాయుడు పరిశీలించారు. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నాణ్యతతో కూడిన పనులు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.