అన్నమయ్య: కురబలకోట మండలంలోని ముదివేడు గ్రామ సచివాలయంలో గురువారం నిర్వహించే వారపు సంత వేలం పాట నిర్వహించారు. ఈ క్రమంలో పంచాయతీకి భారీగా రూ. 5,63,000 ఆదాయం వచ్చినట్లు ముదివేడు పంచాయతీ కార్యదర్శి నరసింహులు తెలిపారు. నౌషాద్ అలీ ఖాన్ దక్కించుకున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో కురబలకోట ఎంపీడీవో గంగయ్య, రాజంపేట టీడీపీ నాయకులు సురేంద్ర యాదవ్ పాల్గొన్నారు.