NDL: భారత ప్రభుత్వ శాఖ హ్యూమన్ రైట్స్ అండ్ సోషల్ జస్టిస్ ఆద్వర్యంలో నందికొట్కూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన తెలుగు శాఖ అధ్యక్షుడు డా.అన్వర్ హుస్సేన్ రెండు అత్యున్నత పురస్కారాలను అందుకున్నట్లు ఆదివారం తెలిపారు. మొదటిది విద్య, సామాజిక సేవలో జీవిత సాఫల్య పురస్కారానికి సంబంధించిందని, రెండోది డా. సర్వేపల్లి రాధాకృష్ణ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అందుకున్నట్లు పేర్కొన్నారు.