NLR: ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు నిబంధనల అతిక్రమిస్తే చర్యలు తప్పవని ఉదయగిరి సీఐ వెంకట్రావు తెలిపారు. ఆదివారం రాత్రి ఉదయగిరిలో ఎస్సై కర్నాటి ఇంద్రసేనారెడ్డి సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీలు చేపట్టారు. ట్రావెల్స్ పత్రాలను పరిశీలించి సేఫ్టీ మెజర్మెంట్స్ పాటిస్తున్నారా లేదా అని ఆరా తీశారు. ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పించారు.