PLD: దుర్గి మండలంలోని అడిగొప్పుల శ్రీ నిదానంపాటి శ్రీలక్ష్మీ అమ్మవారి దేవస్థానంలో సోమవారం హుండీ కానుకల లెక్కింపు చేపట్టారు. గత 47 రోజులకు గాను భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ. రూ.21,17,900 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో కె. ఆదిశేష నాయుడు తెలిపారు. ధర్మకర్త యాగంటి వెంకటేశ్వర్లు, దేవాదాయశాఖ ఇన్స్‌స్పెక్టర్ వి. లీలావతి పర్యవేక్షణలో లెక్కించారు.