W.G: అత్తిలిలో క్రికెట్ బెట్టింగులకు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు తణుకు CI డి.వెంకటేశ్వరరావు తెలిపారు. సోమవారం అందిన ఫిర్యాదుతో దాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 3 వేల నగదు, ల్యాప్టాప్, నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.