కోనసీమ: ఆత్రేయపురం ఉత్సవం సంక్రాంతి సంబరాలు మొదటి రోజు నిర్వహించిన ఈత పోటీలు అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో సాగాయని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించిన ఈ పోటీల్లో సుమారు 200 మంది పైగా పాల్గొన్నారు. మొత్తం 54 మంది విజేతలుగా నిలిచారు. విజేతలందరికీ బహుమతులు అందజేశారు. 18 రకాల ఈవెంట్లలో పోటీలను నిర్వహించారు.