ATP: రాయదుర్గం పట్టణంలో జరిగిన శ్రీ జంబుకేశ్వర స్వామి రథోత్సవంలో ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పాల్గొని భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. రథోత్సవం సందర్భంగా స్వామివారిని దర్శించుకున్న ఆయన.. నియోజకవర్గ ప్రజలందరిపై దేవుని దివ్యాశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.